కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీలు తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారని.. తెదేపా సీనియర్ నేత పిల్లి మాణిక్యరావు విమర్శించారు. నీతి, నిజాయతీ, రాజకీయ విలువలను తుంగలో తొక్కుతూ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. వారి నిజస్వరూపం నిన్నటి రాజ్యసభ ఎన్నికల్లో బట్టబయలైందన్నారు. పార్టీ మారితే ధైర్యంగా మారాలి కానీ.. తెదేపా గుర్తుతో గెలిచి అటూ ఇటూ కాకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వైకాపా గుర్తుతో గెలవగలరా అని సవాల్ విసిరారు.
'ఆ ముగ్గురూ తెదేపాకు ద్రోహం చేస్తున్నారు' - తెదేపా సీనియర్ నేత పిల్లి మాణిక్యరావు
కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీలు తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారని తెదేపా సీనియర్ నేత పిల్లి మాణిక్యరావు విమర్శించారు. తెదేపా గుర్తుతో గెలిచి అటూ ఇటూ కాకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పిల్లి మాణిక్యరావు, తెదేపా సీనియర్ నేత
TAGGED:
tdp leader pilli manikya rao