తడిసిన, రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి.. ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయాలని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో తెదేపా ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో రైతు సమస్యలు పరిష్కరించాలని.. గుడ్లవల్లేరులోని ప్రధాన రహదారిపై రైతులతో కలిసి తెదేపా నాయకులు ట్రాక్టర్లు, బైక్‌లతో భారీ ర్యాలీ తీశారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన తుపాను కారణంగా నష్టపోయిన రైతుల అందరినీ అదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
రైతు సమస్యలు పరిష్కరించాలని.. తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ - ధాన్యం బకాయిలు తాజా వార్తలు
రాష్ట్రంలో రైతు సమస్యలను పరిష్కరించాలంటూ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో తెదేపా ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. గుడ్లవల్లేరులోని ప్రధాన రహదారిపై రైతులతో కలిసి తెదేపా నాయకులు ట్రాక్టర్లు, బైక్‌లతో భారీ ర్యాలీ తీశారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలను వెంటనే చెలించాలని నాయకులు డిమాండ్ చేశారు.
తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ
రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలను వెంటనే చెలించాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కౌలు రైతు కుటుంబానికి సబ్ కలెక్టర్ పరామర్శ