నగర పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరిరోజు కావటంతో తెదేపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణాజిల్లా నందిగామలో తెదేపా తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో చేశారు. స్థానిక కార్యాలయం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెదేపా అభ్యర్థులను గెలిపించాలంటూ.. నందిగామలో ర్యాలీ - tdp rally at nandigama news
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావటంతో కృష్ణాజిల్లా నందిగామలో తెదేపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యాలయం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పార్టీ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ మీదుగా ప్రధాన రహదారిలో అన్ని వార్డుల్లో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ పురపాలక సంఘ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించి వైకాపా అవినీతి పాలనకు చరమగీతం పాడాలని కోరారు. బెదిరించి, దాడులకు పాల్పడుతూ.. అధికార పార్టీ అక్రమ పద్ధతిలో విజయం పొందాలని చూస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పుర పోరు: పోటాపోటీగా అధికార ప్రతిపక్షాల ప్రచారాలు