ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

14వ రోజుకు చేరుకున్న తెదేపా నిరసన దీక్షలు - TDP protest in Vijayawada News

రాష్ట్రంలో కరోనా వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని తెదేపా మండిపడింది. కరోనా బాధితులను ఆదుకోవాలని విజయవాడలో వారు చేస్తున్న నిరసన దీక్షలు 14 వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజయవాడ తెదేపా అర్బన్ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు డిమాండ్ చేశారు.

14వ రోజుకు చేరుకున్న తెదేపా నిరసన దీక్షలు
14వ రోజుకు చేరుకున్న తెదేపా నిరసన దీక్షలు

By

Published : Jul 30, 2020, 4:49 PM IST


విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 14వ రోజు నిరసన దీక్షచేపట్టారు.కరోనా వచ్చి 4 మాసాలు గడుస్తున్న రాష్ట్ర ప్రజలను ఆర్ధికంగా ఆదుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విజయవాడ తెదేపా అర్బన్ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు మండిపడ్డారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటె కార్మికులను, చిరు వ్యాపారస్తుల ప్రతి కుటుంబానికి 10వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కరోనా వైరస్​తో గత 4నెలలుగా కార్మికులకు, వ్యాపారులకు ఉపాధి ఇబ్బంది పడుతున్న వారిని ఆర్ధికంగా ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారని దుయ్యబట్టారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 12రకాల నిత్యావసర సరకులు ఇస్తామని ప్రచారం చేసుకున్నారే తప్ప ఆచరణలో ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తానన్న 3గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఇవ్వలేదన్నారు. ప్రతి కుటుంబానికి 10వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

14వ రోజుకు చేరుకున్న తెదేపా నిరసన దీక్షలు

ఇవీ చదవండి

కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details