ప్రభుత్వం సేకరించిన ఇంటి స్థలాలు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. తెదేపా పిలుపు మేరకు కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లిలో తెదేపా నాయకులతో కలిసి 'నా ఇల్లు నా సొంతం-నా స్థలం నాకివ్వండి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఇళ్ల స్థలాల వద్ద నిరసన చేపట్టారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల అప్పుల పాలయ్యామని ఈ సందర్బంగా లబ్ధిదారులు వాపోయారు.
'ప్రభుత్వం సేకరించిన ఇంటి స్థలాలు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి' - కొణతాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిరసన
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లిలో తెదేపా ఆధ్వర్యంలో 'నా ఇల్లు నా సొంతం-నా స్థలం నాకివ్వండి' అంటూ నేతలు నినాదాలు చేశారు. ప్రభుత్వం సేకరించిన ఇంటి స్థలాలు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సేకరించిన ఇంటి స్థలాలు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి