కరోనా మరణాల్లో ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ.. తెలుగుదేశం విమర్శించింది. సోమవారం విడుదల చేసిన బులిటెన్‌లో.. కరోనాతో 96 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలుగుదేశం నిజనిర్ధరణలో ఆ సంఖ్య 183గా తేలిందని.. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. జగన్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించారు. కేసులను కూడా 20 వేల నుంచి ఒక్కసారిగా 12 వేల 994కు తగ్గించి ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కల్ని తారుమారు చేస్తే కరోనా పోదనేది సీఎం జగన్ గుర్తించాలని హితవు పలికారు. వాస్తవాలు చెప్పి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుప్రతులను సీఎం సందర్శించి.. వ్యవస్థను సన్నద్ధం చేయాలని సూచించారు.
'కరోనా మరణాలపై ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోంది' - today TDP leader Varla Ramaiah comments on corona deaths
ప్రభుత్వం తీరుపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కేసులు, మరణాలు నమోదులో తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు. లెక్కల్ని తారుమారు చేస్తే కరోనా పోదు అనేది సీఎం జగన్ గుర్తించాలని ఎద్దేవా చేశారు.
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య