Varla Ramaiah pressmeet: మంత్రులకు ధైర్యం ఉంటే జగనాసుర రక్తచరిత్ర పుస్తకంపై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలంతా వివేకాను చంపిన అసలు హంతకులెవరో తెలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. జగన్ ఇప్పటికైనా నోరు విప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ఇంటింటికీ ఈ పుస్తకాన్ని పంచే కార్యక్రమాన్ని తెలుగుదేశం చేపట్టబోతోందని, రాష్ట్ర ప్రజలందరికీ వివేకా హత్యపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తుందని వివరించారు.
'జగనాసుర రక్త చరిత్ర'పై బహిరంగ చర్చకు సిద్ధం..: వర్ల రామయ్య - ys viveka murder
Varla Ramaiah pressmeet: జగనాసుర రక్త చరిత్ర పుస్తకంపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సవాల్ విసిరారు. వైఎస్ వివేకా హత్య ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతికి తెలిసే జరిగిందని.. విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో పెద్ద కుట్ర దాగి ఉంది. వైఎస్ వివేకా హత్య గురించి ముఖ్యమంత్రికి, ఆయన భార్య భారతికి ముందే తెలుసు. వారికి తెలిసే జరిగింది. అందుకే ఇతరుల ఫోన్లు తన దగ్గర పెట్టుకున్నడు. ఓఎస్డీ ఫోన్‌తో మాట్లాడుకోవడం వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారూ అని నేను ప్రశ్నిస్తున్నా.. నవీన్ ఫోన్ భారతి గారి దగ్గర ఎందుకు ఉంది.? వివేకానందరెడ్డి ఆ రాత్రి హత్యకు గురవుతున్నారని ఆమెకు కూడా తెలుసు. లేకపోతే ఫోన్ తన దగ్గర ఉంచమని ఎందుకు అడిగారు. అవినాశ్ రెడ్డి మీతో ఎన్ని సార్లు మాట్లాడారో చెప్పగలరా..? హత్యజరిగిన స్థలంలో రక్తపు మరకలు, వివేకా దేహంపై గాయాలు.. వాటన్నింటికీ సమాధానం చెప్పగలరా..? కేసు విషయంలో సీఎం మౌనం ఎందుకు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు తాపత్రయపడుతున్నారు. కేసు విషయంలో అన్ని వేళ్లు ముఖ్యమంత్రి దంపతుల వైపే చూపుతుంటే మౌనం వహించడంలో అర్థం ఉందా..? ధైర్యం ఉంటే.. మేమే చేశామని చెప్పి సీబీఐకి సరెండర్ అవ్వండి. ప్లేస్ మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. టైం మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. డేట్ మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. జగనాసుర రక్త చరిత్ర పుస్తకంపై సమాధానం చెప్పే ధైర్యం ఉంటే రండి.. - వర్ల రామయ్య తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు
ఇవీ చదవండి :