కృష్ణా జిల్లా విజయవాడలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ జీవోలు చదవాలన్న అవగాహన... ముఖ్యమంత్రికి, బూతుల మంత్రికి లేకపోవడం దురదృష్టకరమని ఆయన దుయ్యబట్టారు. రాజ్యాగాన్ని వ్యతిరేకించి సీఎం ప్రవర్తిస్తుంటే ఏం చర్యలు తీసుకుంటారో సీఎస్ సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల్లోకి వెళ్లే అన్యమతస్థులు చట్ట ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉన్నా... అది ఇవ్వనందుకు జగన్ క్షమాపణ చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. కొడాలి నాని బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారన్న వర్ల, బూతులు వాడే వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. 2004లో కొడాలి నానికి సీటిచ్చి ఎమ్మెల్యేని చేయటం చంద్రబాబు చేసిన తప్పన్న ఆయన... అప్పుడు సీటివ్వకుండా ఉంటే లారీలు నడుపుకుంటూ ఉండేవారని వర్ల విమర్శించారు.
బూతుల మంత్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే.. మేం చేసిన తప్పు !
హిందూ దేవాలయాల్లోకి వెళ్లే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని జీవో నెంబర్ 311 స్పష్టం చేస్తోందని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య గుర్తు చేశారు.
మీడియా సమావేశంలో జీవో చూపిస్తున్న వర్లరామయ్య