వైకాపా పాలనలో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం... ఇప్పుడు రాష్ట్రమంతా కొనసాగిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. తమ పార్టీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయటమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. సబ్బంహరి ఇంటి ప్రాంగణం కూల్చివేత, పట్టాభి కారు ధ్వంసం అందులో భాగమేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాడులను ఖండించాలని కోరారు.
'తెదేపా నేతలపై దాడులను సీఎం ఖండించకపోవటం దుర్మార్గం' - tdp polit bureau member chinarajappa
తెదేపా నేతల ఆర్ధిక మూలాలు దెబ్బతీయటమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ఈ దాడులపై ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవటం దుర్మార్గమన్నారు.
తెదేపా నేతలపై దాడులను సీఎం ఖండించకపోవటం దుర్మార్గం: చినరాజప్ప
తెదేపా నేతలపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవటం దుర్మార్గమన్నారు. ఈ ఘటనలపై తెదేపా నేతలు చేస్తున్న ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోగా... బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు భయపడేది లేదని... ప్రభుత్వ అవినీతిపై పోరాడతామని చినరాజప్ప స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
'కరోనా బాధితులు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారు'