దమ్ముంటే.. విశాఖలో గ్యాస్ లీకైన గ్రామాల్లో సీఎం జగన్ అడుగుపెట్టి ఎల్జీ పాలిమర్స్ ఘటనపై చర్చించాలని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. ఎల్జీ కంపెనీకి ఎవరు అనుమతులు ఇచ్చారో, ట్రస్ట్ పేరు చెప్పి చందాలు వసూలు చేసి ప్లాంట్ తెరవడానికి అనుమతులు ఎలా వచ్చాయో... అన్ని విషయాలను సీఎంతో చర్చించి తేల్చుకునేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.
ఈ సవాల్ కు.. విజయసాయి రెడ్డి కూడా సిద్ధమైతే తేదీ, సమయం చెప్పాలంటూ.. ట్వీట్ చేశారు. ఎల్జీ ప్లాంట్ అనుమతులపై చర్చకు హైదరాబాద్ వస్తానని సవాల్ విసురుతున్న వస్తాదు... తెదేపా నాయకులు గ్యాస్ లీకైన గ్రామాలకు వెళ్తామంటే ఎందుకు అడ్డుపడి అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు.