హైకోర్టుకు తెదేపా : పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ పిటిషన్ - highcourt latest News
21:07 April 28
హైకోర్టుకు తెదేపా : పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ పిటిషన్
పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. పది, ఇంటర్ పరీక్షల రద్దు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విద్యార్థుల తరఫున న్యాయపోరాటం చేస్తున్నామని తెదేపా స్పష్టం చేసింది. పరీక్షలు వద్దు, ప్రాణాలే ముద్దు అని తల్లిదండ్రులు చెబుతున్నారన్న తెలుగుదేశం.. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని అభ్యర్థించింది.
ఇవీ చూడండి :బంగాల్ దంగల్: చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం