ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయం -"సాగర్ డ్యాంపై హడావుడి చేయడం జగన్ సైకో చర్య" - చంద్రబాబు తాజా వార్త

TDP Parliamentary Meeting: రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు డిసెంబర్ 6 నుంచి 8 లోగా తాను కలిసేందుకు సమయం కేటాయించాలంటూ CECకి లేఖ రాయనున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు చర్చించారు. స్వార్ధ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడూ జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. కృష్ణా నదీ జలాల పునః సమీక్ష నిర్ణయంపై నోరు తెరవని జగన్ తెలంగాణ ఎన్నికల రోజు పోలీసులతో సాగర్ డ్యాంపై హడావుడి చేయడం సైకో చర్యని ధ్వజమెత్తారు.

TDP_Parliamentary_Meeting
TDP_Parliamentary_Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 7:08 AM IST

Updated : Dec 2, 2023, 10:09 AM IST

ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయం -"సాగర్ డ్యాంపై హడావుడి చేయడం జగన్ సైకో చర్య"

TDP Parliamentary Meeting :రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల సందర్శన పూర్తి చేసుకున్న అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు(TDP Chief Chandrababu) పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై తన నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను జగన్‌ (Jagan) నిర్వీర్యం చేయడంపై ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్, ఏపీ సర్పంచ్‌ల సంఘం నిర్వహించే సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో నిర్వహించే సమావేశాలకు చంద్రబాబు హాజరు కానున్నారు.

Chandrababu Letter to CEC on Irregularities in AP Voter list 2023 : రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలపై దిల్లీ వెళ్లి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీ నాయకులు ఓటమి భయంతో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తీసేయించారని ఆయన ఫిర్యాదు చేయనున్నారు. డిసెంబరు 6 నుంచి ఎనిమిదో తేదీలోగా సమయం ఇవ్వాలని సీఈసీకి చంద్రబాబు లేఖ రాయనున్నట్టు సమాచారం.

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం- కార్యకర్తలకు దిశానిర్దేశం

CBN On Nagarjuna Sagar Dam Project Issue : కృష్ణా నదీ జలాలపై కేంద్రం పునఃసమీక్ష సందర్భంగా నోరు తెరవని జగన్‌, తెలంగాణలో పోలింగ్‌ రోజుననాగార్జున సాగర్‌ వద్ద పోలీసులతో హడావుడి చేయడం సైకో చర్యని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నాలుగున్నరేళ్లలో జగన్‌ తన స్వార్థ, వ్యాపార ప్రయోజనాల కోసం పాకులాడారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. సాగర్‌ డ్యాం వద్ద హడావుడి చేసి విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. నీటి వినియోగంపై అవగాహనలేని వాళ్లు పాలకులు కావడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయన్నారు. కుటిల రాజకీయాలతో జగన్ రాష్ట్రం పరువు తీస్తున్నారని సమావేశంలో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఐపీఎస్ వ్యవస్థ చట్టాలను కాపాడుతుంటే అందుకు విరుద్ధంగా జగన్ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు.

పదేళ్ల పాటు జగన్‌ను రాజకీయాల వైపు చూడకుండా చేయాలి: పవన్ కల్యాణ్

Chandrababu Fires On YSRCP Government :కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలకు కేంద్రం డబ్బులు ఇస్తున్నా, రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడం వల్లే చాలా పథకాలు నిలిచిపోయాయని నేతలు అన్నారు. రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ద, నిధుల సద్వినియోగంపై లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలు గాడి తప్పిన తీరును పార్లమెంట్​లో ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కరవు, పేదరికం, నిరుద్యోగం, మహిళలకు భద్రత లేకపోవడం, అక్రమ కేసులు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి 13 అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు.

తాడేపల్లి ప్యాలెస్‌ గేట్లు పగలగొట్టే వరకు యువగళం కొనసాగిస్తా: లోకేశ్

Last Updated : Dec 2, 2023, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details