ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవైంది: అనురాధ - దేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వార్తలు

సీఎం జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రాష్ట్రంలో దిశా అమలవుతోందా అంటూ నిలదీశారు.

tdp panchamarthi
tdp panchamarthi

By

Published : Sep 3, 2020, 3:40 PM IST

వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవైందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. కృష్ణా జిల్లా ముదినేపల్లిలో దళిత యువతిని ప్రేమ పేరుతో సాయిరెడ్డి వేధించి..పెళ్లి చేసుకోమన్న యువతిపై కక్ష కట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల సహకారంతో యువతి ఇంటికి నిప్పంటించారన్నారని అనురాధ ఆరోపించారు. ఆ కుటుంబానికి జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో దిశా అమలవుతోందా అంటూ నిలదీశారు. చట్ట రూపం దాల్చని దిశపై ముఖ్యమంత్రి సహా నేతలంతా గొప్పలు చెప్పారన్నారు. తెదేపా హయాంలో కట్టించిన భవనాలకు దిశా పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టి హడావుడి చేశారని విమర్శించారు. 13 జల్లాల్లోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని ఊదరగొట్టారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:విద్యుత్ నగదు బదిలీ పథకం శ్రీకాకుళం నుంచి ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details