పోలీసుల తోపులాటలో అస్వస్థతకు గురైన తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్‌కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడుని కలవడానికి బయల్దేరిన చింతమనేనిని ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. చింతమనేని ఆరోగ్య పరిస్థితిపై లోకేశ్ ఆరా తీశారు. ఇంటికి బయలుదేరిన తనను కొవిడ్ పరీక్షలు, ఇతర నిబంధనల పేరుతో పోలీసులు అడ్డుకోవాలని చూశారని చింతమనేని లోకేశ్‌కు తెలిపారు. చింతమనేనికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసానిచ్చారు.
అస్వస్థతకు గురైన చింతమనేనికి లోకేశ్ ఫోన్ - చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ న్యూస్
అచ్చెన్నాయుడుని కలవడానికి బయలుదేరిన చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ప్రభాకర్ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితిపై చింతమనేనికి ఫోన్ చేసి లోకేశ్ తెలుసుకున్నారు.

tdp-national
Last Updated : Jun 13, 2020, 4:44 AM IST