ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు : చంద్రబాబు, లోకేశ్ - తెలుగుదేశం అధినేత చంద్రబాబు తాజా వార్తలు

పవిత్ర రంజాన్ పర్వదినం సందర్బంగా ముస్లింలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర 'రంజాన్ మాసం' అని చంద్రబాబు పేర్కొన్నారు.

ముస్లింలందరికీ పవిత్ర రంజాన్ పండగ శుభాకాంక్షలు : చంద్రబాబు, లోకేశ్
ముస్లింలందరికీ పవిత్ర రంజాన్ పండగ శుభాకాంక్షలు : చంద్రబాబు, లోకేశ్

By

Published : May 14, 2021, 10:36 AM IST

ముస్లిం సోదర, సోదరీమణులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రంజాన్‌ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర 'రంజాన్ మాసం' అని చంద్రబాబు కీర్తించారు. ఈ పుణ్యమాసంలో అత్యంత నిష్టగా ఉపవాస దీక్షను ముగించుకుని పండుగ జరుపుకుంటున్న ముస్లింలందరికీ ఈద్ ముబారక్‌ తెలియజేశారు. కరోనా నుంచి మానవాళిని రక్షించాలని అల్లాను వేడుకుందామని పిలుపునిచ్చారు. సేవా దృక్పథం, సోదరభావానికి చిహ్నంగా నిలిచే రంజాన్ సందర్భంగా ఇంటిల్లిపాదికీ శుభాలను, ఆనందాలను పంచివ్వాలని చంద్రబాబు ఆకాక్షించారు.

క్రమశిక్షణ, సేవాగుణం, సౌభ్రాతృత్వం కోసం..

మనిషిలోని బలహీనతలను, స్వార్థ భావాలను తుడిచిపెట్టి, వాటి స్థానంలో క్రమశిక్షణ, సేవాగుణం, సౌభ్రాతృత్వం భావాలను పెంపొందించేదే రంజాన్ ఉపవాస దీక్ష మాసమని లోకేశ్‌ పేర్కొన్నారు. ఇలాంటి పవిత్ర మాస దీక్షలను ముగించుకుని ఈ రోజు పండుగ నిర్వహించుకుంటున్నామని అన్నారు.

ఇవీ చూడండి :

ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details