వైకాపా నిరుద్యోగులకు పట్టం కట్టి, నిజమైన నిరుద్యోగులకు సీఎం జగన్ పాడె కడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రికి గుర్తురావడం లేదని మండిపడ్డారు. కర్నూలు జిల్లా పర్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు రమేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీసీ పూర్తి చేసినా ఉద్యోగం లేకపోవడం, మరోపక్క అప్పుల బాధ తట్టుకోలేక రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఆత్మహత్యలు నివారించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
LOKESH: నిజమైన నిరుద్యోగులకు వైకాపా ప్రభుత్వం పాడె కడుతోంది - Nara Lokesh responds on unemployment issues latest
సీఎం జగన్ నిజమైన నిరుద్యోగులకు పాడె కడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెదేపా నాయకుడు నారా లోకేశ్