పోలవరం రివర్స్ టెండరింగ్‌ను నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్సీలు విజయవాడలో సమావేశమయ్యారు. పొలవరం రివర్స్ టెండర్ పేరుతో నిబంధనలు పాటించలేదని, ఇదంతా పెద్ద మోసంగా ఉందని తెదేపా నేతలు అన్నారు.మాక్స్ ఇన్‌ఫ్రా సంస్థకు అర్హత లేదన్న వైకాపా నేతలు.. ఇప్పుడెలా టెండర్ ఇచ్చారని ప్రశ్నించారు. త్వరలో అన్ని వాస్తవాలతో నిజానిజాలు ప్రజలకు తెలియజేస్తామని ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, అశోక్ బాబులు తెలిపారు.
రివర్స్ టెండర్లు కాదు...రిజర్వుడ్ టెండర్లు
పోలవరం రివర్స్ టెండరింగ్‌పై తెదేపా నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెండరింగ్ వలన ఆరు వందల కోట్ల రూపాయలు మిగిల్చామని జలవనరుల శాఖ మంత్రి అనడంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, అశోక్ బాబులు సవాలు విసిరారు.
పోలవరం రివర్స్ టెండరింగ్