ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా పాలన రంగుల మయం... అభివృద్ధి శూన్యం' - అసెంబ్లీ సమావేశాలు 2019

వైకాపా ఆరు నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని తెదేపా ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు విమర్శించారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేసి రూ.1300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Tdp mlc srinivasulu on assembly session
'వైకాపా పాలన రంగుల మయం.. అభివృద్ధి శూన్యం'

By

Published : Dec 6, 2019, 11:46 PM IST

మాట్లాడుతున్న తెదేపా ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు
వైకాపా ఆరు నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీలేదని తెదేపా ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ఆరోపించారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... రాజధానిని నిలిపివేయడం, ప్రజావేదిక కూల్చడం, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు, శ్మశానాలకు వైకాపా రంగులు వేయడం తప్ప కొత్తగా వైకాపా చేసిందేమీలేదన్నారు. భవనాలకు వైకాపా రంగుల కోసం రూ.1300 కోట్లు, ముఖ్యమంత్రి నివాస సౌకర్యాలకు రూ.15 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప, అభివృద్ధి శూన్యమని శ్రీనివాసులు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహిస్తేనే ప్రజాసమస్యలు పూర్తిగా చర్చకు వస్తాయన్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details