మూడు రాజధానుల బిల్లుపై... హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం రాబోయే విజయానికి సంకేతమని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. అమరావతిని తరలించడం సీఎం జగన్ వల్ల కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెదేపా ఎమ్మెల్సీలంతా కలిసి సెలెక్ట్ కమిటీ అంశాన్ని మరోసారి హైకోర్టు, సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. అమరావతిని ముక్కలు చేసి 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నాశనం చేయవద్దని హితవు పలికారు.
'మూడు రాజధానుల బిల్లుపై... హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం విజయానికి సంకేతం' - తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
మూడు రాజధానుల బిల్లుపై... హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం రాబోయే విజయానికి సంకేతమని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. అమరావతిని తరలించడం సీఎం జగన్ వల్ల కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల బిల్లుపై... హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం విజయానికి సంకేతం
అమరావతి అంశంపై తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని... వైకాపా నేతలు సిద్ధమా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేసిన జగన్... దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాజధాని అమరావతే అని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఇదీ చదవండి: