మంత్రి అవంతి శ్రీనివాస్ అబద్ధాలకు మారుపేరుగా నిలిచారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. మునిగిన పడవను 38 రోజులపాటు తీయలేనందుకు సిగ్గుపడాల్సిందిపోయి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసి దీపావళి రోజున వారి జీవితాల్లో చీకట్లు నింపారని దుయ్యబట్టారు. ఐదు నెలల్లో సంక్షేమ రంగంపై ఒక్క పైసా ఖర్చు చెయ్యకుండా... రాష్ట్రంలో సమస్యలే లేవని అవంతి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
మంత్రి అవంతిపై తెదేపా ఎమ్మెల్సీ మంతెన విమర్శలు - Mlc Manthena Comments On Minister Avanthi latest news
అంతులేని అబద్ధాలకు మంత్రి అవంతి శ్రీనివాస్ మారుపేరుగా నిలిచారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. మునిగిన పడవను 38 రోజుల పాటు తీయలేనందుకు సిగ్గుపడాల్సిందిపోయి గొప్పలు చెప్పుకుంటారని మండిపడ్డారు.
Tdp Mlc Manthena Comments On Minister Avanthi