ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం దేవుడనే ఎంపీకి.. పక్క రాష్ట్రంలో చికిత్స ఎందుకు: దీపక్ రెడ్డి

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతల వల్లే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోందని ఆరోపించారు.

tdp mlc deepak reddy
tdp mlc deepak reddy

By

Published : Jul 25, 2020, 5:26 PM IST

క‌రోనా వైర‌స్ వ్యాప్తికి వైకాపా నేతలే కారణమని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. ర్యాలీలు, సభలు, పుట్టినరోజు వేడుకలు, ప్రారంభోత్సవాలంటూ వైకాపా నేతలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాగే చేస్తే.. కరోనా కేసుల వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వస్థానానికి చేరుతుందని దీపక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ దేవుడనే ఎంపీ విజయసాయి రెడ్డి… పక్కరాష్ట్రంలో చికిత్స పొందడం ఏంటని ప్రశ్నించారు. తమవే ప్రాణాలు… ప్రజలవి కావన్నట్లుగా అధికార పార్టీ వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ఒక్క వైకాపా నేత కూడా క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించి.. రోగుల బాధలను తెలుసుకోలేదని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:మాజీ మంత్రి గంటా అనుచరుడు నలంద కిశోర్‌ మృతి

ABOUT THE AUTHOR

...view details