ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వీడియో ఫుటేజీలు బయటపెట్టండి.. మా తప్పుంటే రాజీనామా చేస్తాం'

ఈనెల 17న శాసన మండలిలో జరిగిన విషయాలు ప్రజలకు తెలియాలంటే వీడియో ఫుటేజీలు బయట పెట్టడమే మార్గమని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. ఆ రోజు జరిగిన దానిలో తమ తప్పుంటే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. అధికార పార్టీ తప్పు లేకపోతే ప్రభుత్వం ఆ వీడియోలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

tdp mlc deepak reddy about council issue
దీపక్ రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ

By

Published : Jun 24, 2020, 4:39 PM IST

శాసన మండలిలో అధికార పార్టీ మంత్రుల దుర్భాషలు, దాడిపై ఈనెల 18న తాము ఛైర్మన్​కు ఫిర్యాదు చేస్తే, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు. మంత్రుల కౌంటర్ ఫిర్యాదులో వాస్తవముంటే వీడియో ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మండలిలో జరిగిన దానిపై వైకాపా సభ్యులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

'ఈనెల 17న శాసనమండలిలో జరిగిన దానిపై మేం 18న ఫిర్యాదు చేశాం. మేం ఫిర్యాదు చేసిన 6 రోజుల తర్వాత వైకాపా సభ్యులు కౌంటర్ ఫిర్యాదు చేశారు. అంటే ఏమిటర్థం.. మా ఫిర్యాదుపై దర్యాప్తు చేపడితే వాస్తవాలు బయటకొస్తాయనే భయంతో 6 రోజుల తర్వాత కంప్లైంట్ చేశారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు ఎవరు అవాస్తవాలు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి'-- దీపక్ రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ

3 రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినప్పుడు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారని.. మండలిలో సమస్య ఉన్నప్పుడు లైవ్ టెలీకాస్ట్ ఆపేయడమే వైకాపా ప్రభుత్వ పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో జరిగిన వాస్తవాలు బయటకు రావాలంటే వీడియో ఫుటేజీని పరిశీలించడం ఒక్కటే మార్గమని వ్యాఖ్యానించారు. తెదేపా సభ్యుల తప్పుంటే రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి...

'అధికారులు, నాయకులు కలిసి ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details