ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపాకు లొంగనందుకే అరెస్టులు: దీపక్​రెడ్డి

By

Published : Jun 13, 2020, 1:35 PM IST

Updated : Jun 13, 2020, 1:47 PM IST

తెదేపా నేత జేసీ ప్రభాకర్​రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులను ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఖండించారు. వారిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. వైకాపాలోకి చేరని వారిని అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.

dipak reddy
dipak reddy

తెదేపా సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిది అరెస్టు కాదు.. కిడ్నాప్ అని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. అధికారులు నిజాలు నిర్ధరించుకోవాలని సూచించారు. నేరాలు జరగకుండా చూడాల్సిన అధికారులే... నేరాలు చేస్తున్నారని దీపక్ రెడ్డి విమర్శించారు. లొంగని వారిని అరెస్టు చేయటం వైకాపా నైజమని మండిపడ్డారు. సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడే అధికార పార్టీ నేతలపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. దేశంలో ఎక్కువ క్రిమినల్ కేసులు వైకాపా నేతలపైనే ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ అందరినీ భయపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Last Updated : Jun 13, 2020, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details