ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భవనంపై నుంచి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించు..' - తెదేపా నేత బుద్దా వెంకన్న

అమరావతిని గ్రాఫిక్స్ అంటూ ట్విట్ చేసిన వైకాపా ఎంపీ విజయ సాయిరెడ్డికి... తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. దమ్ముంటే అక్కడ చంద్రబాబు కట్టించిన భవనంపై నుంచి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలన్నారు.

tdp mlc budha venkanna fires on ycp mp vijayasaireddy
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్

By

Published : Jul 17, 2020, 9:59 AM IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్

అమరావతిని గ్రాఫిక్స్ అంటూ ట్విట్ చేసిన వైకాపా ఎంపీ విజయ సాయిరెడ్డికి తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సవాల్‌ విసిరారు. దమ్ముంటే అక్కడ చంద్రబాబు కట్టించిన భవనంపై నుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలని అన్నారు. మూడు ముక్కలాట మొదలుపెట్టి ఒక్క ఇటుక పెట్టని వైకాపా ప్రభుత్వమా.. విశాఖలో అద్భుత నగరాన్ని కట్టేది అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం అంటే బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ జనాన్ని పెట్టినంత ఈజీ కాదని విజయ సాయిరెడ్డికి హితవు పలికారు. విజయసాయి రెడ్డి ఎప్పుడు వస్తారో చెబితే మీడియాతో సహా బిల్డింగ్ కింద వెయిట్ చేస్తానంటూ ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details