వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపీ విజయసాయిరెడ్డికి.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బర్త్డే విషెస్ - ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజా వార్తలు
తెదేపా నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న..వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికైనా మనసు మార్చుకుని దొంగలెక్కల చిట్టా బయటపెట్టాలని ఆయన వ్యంగ్యాస్త్రాలతో ట్వీట్ చేశారు.
tdp mlc budha
"300 కోట్లు కొట్టేసి.. 108 వాహనాల ప్రారంభోత్సవం, విజయసాయిరెడ్డి జన్మదినం ఒకే రోజు రావడం యాదృచ్చికమా.. లేక ఆయన వేసిన రివర్స్ టెండర్కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా..? ఇప్పటికీ ఆలస్యం కాలేదు.. మనసు మార్చుకుని దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటున్నా. విజయసాయి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు"- ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్ కొనుగోళ్లు