రోజూ చంద్రబాబు జపం చేయందే.. వైకాపా నేతలకు నిద్ర పట్టదా? అని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. రఘురామ కృష్ణం రాజుకు ప్రాణాపాయం ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే.. చంద్రబాబుపై వైకాపా నేతలు నిందలేయటం దుర్మార్గమని మండిపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజుకి ఎంపీ టిక్కెట్టు చంద్రబాబు చెప్తేనే జగన్ ఇచ్చారా అని నిలదీశారు. హత్యారాజకీయాలు, వేధింపులు, కక్షసాధింపులు, కులమతాల మధ్య చిచ్చులు చంద్రబాబుకి తెలియవన్న ఆయన వైకాపా నేతలు ఈ విషయం గ్రహించాలని హితవు పలికారు.
చంద్రబాబు జపం చేయందే వైకాపా నేతలకు నిద్రపట్టదా: బుద్ధా వెంకన్న - తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తాజా వ్యాఖ్యలు
చంద్రబాబుపై వైకాపా నేతలు నిందలేయటం దుర్మార్గమని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. రోజూ చంద్రబాబు జపం చేయందే వైకాపా నేతలకు నిద్ర పట్టదా అని ప్రశ్నించారు. వేధింపులు, కక్షసాధింపులు, కులమతాల మధ్య చిచ్చులు చంద్రబాబుకి తెలియవన్నారు.

తెదేపా నేత బుద్ద వెంకన్న