కొన్నేళ్లుగా అసంపూర్తిగా వదిలేసిన విజయవాడ గ్రామీణ మండలం నున్న బైపాస్ రోడ్డును.. తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పరిశీలించారు. నున్న మ్యాంగో మార్కెట్ నుంచి నూజివీడు వైపు వెళ్లే బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా.. పాలకులు ఆ విషయంపై దృష్టి సారించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోడ్డు పనుల అలసత్వంపై మండలిలో నిలదీస్తా: బచ్చుల అర్జునుడు - నున్న బైపాస్ రోడ్డును పరిశీలించిన బచ్చుల అర్జునుడు
కృష్ణా జిల్లా నున్న బైపాస్‌రోడ్డుకు వెళ్లే దారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని.. తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. విజయవాడ మ్యాంగో మార్కెట్ నుంచి నున్న వెళ్లే దారిలో బైపాస్‌రోడ్డు నిర్మాణాన్నిఆయన పరిశీలించారు.
అసంపూర్తిగా వదిలేసిన నున్న బైపాస్ రోడ్డును పరిశీలించిన బచ్చుల అర్జునుడు
ఈ కారణంగా... అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారిందని ఆయన ఆరోపణలు చేశారు. ఇతర కారణాల వల్ల ఈ రోడ్డు పనులను ఆపటం సబబు కాదని అన్నారు. నున్న బైపాస్ రోడ్డు నిర్మాణం అలసత్వంపై త్వరలో శాశన మండలిలో ప్రశ్నించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:రోజుకో వేషంతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
Last Updated : Jan 20, 2021, 2:55 PM IST