ప్రజలకు మేలుచేయాలన్న ఆలోచన జగన్ ప్రభుత్వానికి ఉంటే చట్టవిరుద్ధంగా.. భూములసేకరణ చేసేది కాదని తెలుగుదేశం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి పేదలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లేదు కాబట్టే, చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన 6లక్షల ఇళ్లను గాలికొదిలేసిందని మండిపడ్డారు. అమరావతిలో శాసనరాజధాని వద్దని చెప్పటం ద్వారా మంత్రి కొడాలి నాని కోర్టులను బెదిరించారని ధ్వజమెత్తారు. కోర్టులు ఎక్కడో కొన్నిచోట్ల స్టేలు ఇస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాల పంపిణీని ఎందుకు నిలిపేశారని నిలదీశారు. ఇళ్లపట్టాల పంపిణీ పేరుతో 9వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, దానిలో 3వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఆ దోపిడీ వ్యవహారం బయటకు రాకూడదనే కొడాలి నానీతో ప్రభుత్వం అలా మాట్లాడించిందన్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ అధికారపార్టీ నేతలే చాలా ప్రాంతాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించారని గుర్తుచేశారు.
'కొన్ని చోట్ల స్టే ఇస్తే.. రాష్ట్రమంతటా ఇళ్ల స్థలాల పంపిణీ ఎందుకు ఆపేశారు?' - bachula comments on ycp govt news
వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే.. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన 6 లక్షల ఇళ్లను గాలికి వదిలేసిందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ధ్వజమెత్తారు.
తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు