తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అడగకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ప్రాజెక్టులు అన్నీ నీటితో నిండి ఉన్నా విద్యుత్ కోతలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ను అడిగి కొత్తగూడెం నుంచి బొగ్గు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్... విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వల్ల రాష్ట్ర ఆర్థిక రంగంపైనా ప్రభావం పడుతుందన్నారు.
విద్యుత్ కోసం కేసీఆర్ను అడిగి బొగ్గు తీసుకురండి: తెదేపా - mlc ashokbabu comments on jagan, kcr relation
రాష్ట్రంలో విద్యుతో కోతలపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎంను అడిగి బొగ్గు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణ సీఎంను అడిగి బొగ్గు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అశోక్‌బాబు