ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ద్రవ్య వినిమయ బిల్లుకు ఎవరు అడ్డం పడ్డారో రెండు రోజుల్లోతెలుస్తుంది' - ఏపీ ద్రవ్య వినిమయ బిల్లు వార్తలు

ద్రవ్య వినిమయ బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టకుండా వైకాపా మంత్రులే కాలయాపన చేశారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. కానీ తమపై నెపాన్ని నెడుతున్నారని దుయ్యబట్టారు.

tdp leader ashok babu
tdp leader ashok babu

By

Published : Jul 2, 2020, 6:21 PM IST

ద్రవ్య వినిమియ బిల్లుకి తెలుగుదేశం అడ్డుపడిందని మంత్రులు, వైకాపా నాయకులు చెప్పడం దారుణమని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. మొన్నటి సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టండి అని పట్టుబట్టింది తెదేపానే అని గుర్తు చేశారు. కానీ మంత్రులు ఆ బిల్లును పెట్టకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. ఇప్పుడు నెపాన్ని తమ మీద నెడుతున్నారని తప్పుబట్టారు.

వైకాపా నాయకులు అవినీతిలో ప్రయాణం చేస్తున్నారని.. ఏదో రోజు మునిగిపోవడం ఖాయమని అశోక్ బాబు విమర్శించారు. రెండు రోజుల్లో మండలి మినిట్స్ బయటకి వస్తాయన్న అశోక్ బాబు.. బిల్లుకు అడ్డుపడింది ఎవరనేది అప్పుడు ప్రజలకు తెలుస్తుందన్నారు.
ఇదీ చదవండి

రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: సభాపతి తమ్మినేని

ABOUT THE AUTHOR

...view details