ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
వేలమంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసేశారని ఆరోపించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి, ఇప్పటివరకు ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆగ్రహించారు. వెంటనే హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.