అమరావతిలో భూసేకరణ విషయంలో వైకాపా ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు. మాజీ మంత్రి నారాయణ 3 వేల ఎకరాలు కొన్నట్లు పుస్తకాల్లో ప్రచురించి... రికార్డుల్లో మాత్రం సున్నాగా చూపారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతితో పాటు ఇళ్ల స్థలాల పేరిట విశాఖలో భూసేకరణపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చే్శారు.
తనపై ఉన్న అవినీతి కేసుల విచారణ 3 నెలల్లో పూర్తి చేయాలని కోరుతూ సీఎం జగన్తో అంబటి రాంబాబు కోర్టులో అఫిడవిట్ వేయించగలరా? అని అశోక్ బాబు సవాల్ విసిరారు. రాష్ట్రానికి మంచిరోజులు రావాలంటే అమరావతి పునర్ నిర్మాణం తప్ప మరో మార్గం లేదని వైకాపా ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు.