నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం ఆరు గంటల వరకు వెలువడిన ఫలితాల్లో.. తాము బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధులు 1119 చోట్ల గెలుపొందినట్లు తెలుగుదేశం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో 111 మంది, విజయనగరంలో 104, విశాఖ 51 మంది గెలుపొందినట్లు వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో 98, పశ్చిమ గోదావరిలో 103, కృష్ణలో 88, గుంటూరులో 93 మంది, ప్రకాశం జిల్లాలో 76, నెల్లూరులో 60 మంది సర్పంచ్‌లుగా ఎన్నికైనట్లు ప్రకటించింది. రాయలసీమ జిల్లాల్లో కడపలో 81, కర్నూలులో 82, అనంతపురంలో 79, చిత్తూరులో 93 చోట్లు తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్లు స్పష్టం చేసింది.
ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న కొంతమంది పోలీసులు, సిబ్బంది వైకాపాకు అనుకులంగా ఫలితాలు మారుస్తున్నారని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారులందరూ సత్వరమే ఫలితాలను ప్రకటించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.