వైకాపా నాయకుని హత్య కేసులో అరెస్టైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు పరామర్శించారు. వైకాపా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల నేతలను అక్రమ కేసుల్లో ఇరికించి కక్ష తీర్చుకుంటోందని విమర్శించారు. కొల్లు రవీంద్ర ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని.. త్వరలోనే ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పారు.
కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులకు తెదేపా నేతల పరామర్శ - కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులకు తెదేపా ఎమ్మెల్యేల పరామర్శ వార్తలు
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను తెదేపా ఎమ్మెల్యేలు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. రవీంద్ర ఎలాంటివాడో అందరికీ తెలుసని.. ఆయన త్వరలోనే బయటకు వస్తారని ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు అన్నారు.
కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులకు తెదేపా నేతల పరామర్శ