సీఎం జగన్కు తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ - Tdp MLA Vallabhaneni dynasty letter to CM pics
ముఖ్యమంత్రి జగన్కు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ రాశారు. పోలవరం కుడి కాల్వ కింద వ్యవసాయం చేస్తున్న రైతుల మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్కు తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ
పోలవరం కుడి కాల్వలో మోటార్లకు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి గన్నవరం ఎమ్మెల్యే వంశీ లేఖ రాశారు. పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని రైతులకు దక్కేలా 500మోటార్లు తాను ప్రభుత్వానికి ఇస్తానని అయన లేఖలో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా తాను ఏర్పాటు చేసిన మోటార్లకు ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తూ వచ్చిందని తెలిపిన వంశీ.. ఇప్పుడు కూడా రైతుల సౌలభ్యం కోసం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.