ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాపై ఆరోపణలు దుర్మార్గం: చినరాజప్ప - ప్రభుత్వంపై నిమ్మకాయల చినరాజప్ప ధ్వజం

దళితులపై దాడులకు బాధ్యత వహించకుండా.. తెదేపాపై విమర్శలు చేయటం తగదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప హితవు పలికారు. దేవాలయాలపై జరిగిన దాడులపై ముఖ్యమంత్రి స్పందించకుండా.. మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారనీ.. అధికారులు సైతం ప్రభుత్వానికే కొమ్ముకాస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

tdp mla nimmakayala chinarajappa fires on govt
నిమ్మకాయల చినరాజప్ప

By

Published : Sep 30, 2020, 3:40 PM IST

వైకాపా ప్రభుత్వ తీరుపై పెద్దాపురం ఎమ్మెల్యే, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయ చినరాజప్ప ధ్వజమెత్తారు. వైకాపా మాటలు వినటం వల్లే పోలీసు యంత్రాంగానికి కోర్టు నుంచి మెుట్టికాయలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. దేవాలయాలు, దళితులపై దాడులు జరుగుతుంటే.. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయటం లేదని ఆరోపించారు.

దళితులపై దాడులకు బాధ్యత వహించకుండా తెదేపాపై ఆరోపణలు చేయటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి మంత్రులు, అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పులను ఒప్పుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details