రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదన్న గోరంట్ల బుచ్చయ్య
రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి - tdp mla gorantla buchaiah chowdary news
రాష్ట్రంలో నెలకొనే సంక్రాంతి కళ ఈ సంవత్సరం లేదని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రాంతీయ విద్వేషాలతో ప్రజలను ప్రభుత్వం బాధల్లోకి నెట్టిందని ఆయన విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలుండటం దురదృష్టకరమని అన్నారు. రాజధానిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడి...ఎక్కువ పెట్టుబడులు వచ్చి పరిపాలన సజావుగా సాగుతున్న నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేసి...మూడు ప్రాంతల మధ్య చిచ్చు పెట్టారని అన్నారు.
![రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి tdp mla gorantla buchaiah chowdary fires on government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5714018-499-5714018-1579031036708.jpg)
రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదన్న గోరంట్ల బుచ్చయ్య