రైతులపై వైకాపాది కపట ప్రేమని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. రైతు భరోసా, విత్తనాలు, ఎరువుల పంపిణీ, మద్దతు ధరల ప్రకటన, వరద సాయం ఇలా అన్ని అంశాల్లో రాష్ట్ర రైతుల్ని మోసం చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దేశమంతా వ్యతిరేకించిన విద్యుత్ మీటర్లను సీఎం జగన్ ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలతో తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ జగన్ రైతు ద్రోహిగా మిగిలారని అనగాని దుయ్యబట్టారు.
సీఎం జగన్ రైతు ద్రోహిగా మిగిలిపోతారు: అనగాని - ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వార్తలు
రైతు వ్యతిరేక విధానాలకు మద్దతిస్తూ సీఎం జగన్ రైతు ద్రోహిగా మిగిలిపోయారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఒకవైపు రైతులను మోసం చేసి.. మరోవైపు వారిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని మండిపడ్డారు. రైతులపై వైకాపాది కపట ప్రేమని విమర్శించారు.
అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే