గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పుట్టినరోజు సందర్భంగా... కృష్ణాజిల్లా ఎనికేపాడు మండలంలో తెదేపా కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొందరు నేతలు కక్షసాధింపు చర్యగా ఆ బ్యానర్లు తొలగించారని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. ఫలితంగా.. అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
జాతీయ రహదారిపై తెదేపా శ్రేణుల ఆందోళన - tdp members protest at vijayawada
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. తెదేపా నేత వల్లభనేని వంశీ పుట్టినరోజు సందర్భంగా... ఆ పార్టీ శ్రేణులు కృష్ణా జిల్లా ఎనికేపాడు మండలంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. తాము ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ... రహదారిపైకొచ్చి నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళన చేస్తున్న తెదేపా కార్యకర్తలు
Last Updated : Oct 22, 2019, 2:06 PM IST