ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు భరోసా పేరిట ప్రభుత్వం మోసం చేసింది' - రైతు భరోసాపై తెదేపా నేత పట్టాభిరామ్

వైకాపా ప్రభుత్వం తప్పుడు లెక్కలతో రైతులను మోసం చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. గతేడాది అక్టోబర్ లో 54 లక్షల మందికి రైతు భరోసా వర్తింపజేస్తున్నట్లు చెప్పి.. మూడున్నర లక్షల మందికి కోతపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leadet pattabhi  on raithu bharosa
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

By

Published : Oct 27, 2020, 7:23 PM IST

రైతు భరోసా పేరిట ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా మోసం చేసిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. గతేడాది అక్టోబర్ లో 54 లక్షల మందికి రైతు భరోసా వర్తింపజేస్తున్నట్లు ప్రకటన ఇచ్చి.. ఈ సారి మూడున్నర లక్షల మందికి కోతపెడుతూ ప్రకటన ఇచ్చారని ఆగ్రహించారు. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో ఈ సంఖ్య 38లక్షలకే పరిమితమైందని వివరించారు.

అన్నం పెట్టే అన్నదాతల్ని నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగి అగ్రస్థానంలో ఉందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం.. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య 15 లక్షలుంటే రైతు భరోసాని నామమాత్రంగా అమలు చేస్తున్నారని ఆధారాలను ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details