Gudivada Casino: గుడివాడ క్యాసినో వ్యవహారంపై తెలుగుదేశం నేతలు ఐటీ శాఖ అధికారులను కలిసి సాక్ష్యాలు అందజేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినో వివాదాస్పదమైంది. అప్పుడు పౌరశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొడాలినాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీలు.. క్యాసినో నిర్వహణ ద్వారా వందల కోట్ల నల్లధనం చేతులు మార్చారని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. వివిధ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ.. సమాచారం సేకరణలో భాగంగా విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయానికి రావాలని కోరింది. ఐటీ శాఖ కార్యాలయానికి వెళ్లనున్న వర్ల రామయ్య, బొండా ఉమ తదితర నేతలు.. అధికారులకు సమాచారం అందించనున్నారు.
గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖకు ఆధారాలు ఇవ్వనున్న టీడీపీ నేతలు - క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖ స్పందించింది
Gudivada Casino: కృష్ణా జిల్లా గుడివాడలో.. గత సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహించిన క్యాసినో వ్యవహారం వివాదాస్పదమైంది.. టీడీపీ నేతల చేసిన ఆరోపణలకు స్పందించిన ఐటీ శాఖ అధికారులు..తగిన ఆధారాలను అందజేయాలని ఆదేశాాలు జారీ చేశారు..తరువాత ఏం జరిగిందంటే..

గుడివాడ క్యాసినో
గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖకు ఆధారాలు ఇవ్వనున్న టీడీపీ నేతలు
Last Updated : Dec 19, 2022, 11:50 AM IST