ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొల్లు రవీంద్రను పరామర్శించిన తెదేపా నేతలు - tdp leaders visit kollu raveenra house updates

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఇటీవల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను తెదేపా నేతలు పరామర్శించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుల రాజకీయ ఉన్నతిని సహించలేని ప్రభుత్వం ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తుందని వారు ఆరోపించారు.

tdp leaders
tdp leaders

By

Published : Aug 31, 2020, 4:27 PM IST

మచిలీపట్నంలో ఇటీవల పాత కక్షలతో జరిగిన వైకాపా నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి కేసులో అక్రమంగా ఇరికించిందని తెదేపా నేతలు ఆరోపించారు. న్యాయస్థానం కొల్లు రవీంద్రకి ఇటీవల బెయిల్ మంజూరు చేయటంతో ఆయన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవి అంజినేయులు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావులు పరామర్శించారు.

వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుల రాజకీయ ఉన్నతిని సహించలేని ప్రభుత్వం ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తుందని వారు ఆరోపించారు. ఈ కేసు నుండి కొల్లు రవీంద్ర కడిగిన ముత్యంలా వస్తారని నేతలు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:ప్రశాంత్​ భూషణ్​కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా

ABOUT THE AUTHOR

...view details