కృష్ణా జిల్లా గుడివాడలో అన్యాక్రాంతమయ్యే దేవాదాయ భూముల్ని పరిరక్షించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దేవాదాయ కమిషనర్‌కు లేఖ రాశారు. గుడివాడ శివారు పులివర్తి, యల్లయ్యపాలెం గ్రామాల పరిధిలో రూ.250కోట్లు విలువ చేసే 25ఎకరాల దేవాదాయ భూమిని కాజేసేందుకు మంత్రి కొడాలి నాని యత్నిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు.
అన్యాక్రాంతమయ్యే దేవాదాయ భూముల్ని కాపాడండి..
కృష్ణా జిల్లా గుడివాడలో అన్యాక్రాంతమయ్యే దేవాదాయ భూముల్ని పరిరక్షించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దేవాదాయ కమిషనర్ కు లేఖ రాశారు. "అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి భీమేశ్వరస్వామి, వేణుగోపాల స్వామి భూముల్ని దోచుకునేందుకు యత్నిస్తున్నారు. వెలివర్తిపాడులో 272 సర్వే నెంబర్ లో 15.07 ఎకరాలు, 294 సర్వే నంబర్ లో 5.64 ఎకరాలు, యల్లయపాడులో సర్వే నంబరు 4 లో 4.83 ఎకరాలు భూముల్ని జిల్లా సంయుక్త కలెక్టర్ సాయంతో దోపిడీ చేసేందుకు పావులు కదుపుతున్న మంత్రి చర్యలను అడ్డుకోవాలి. మంత్రి సేవలో తరిస్తున్న అధికారుల్ని కట్టడి చేయాలి. నిషేధిత జాబితాలో 1942నుంచి ఉన్న భూముల్ని అన్యాక్రాంతం ఎలా చేస్తారు. అధికారుల్ని సైతం జైలుకు తీసుకెళ్లే అలవాటు ఈ ప్రభుత్వ పెద్దలకు ఉంది. వెంటనే ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని భూములు మంత్రి చేతిలో పడకుండా కాపాడాలి" అని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.
దేవుడి భూమి కాజేసేందుకు యత్నం..