ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తనకు మిత్రుడని, తెలుగు ప్రజల శ్రేయోభిలాషి అని, తెలుగు భాషాభిమాని అని కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన తెలుగువెలుగు, వెంకయ్యనాయుడని లోకేశ్ కొనియాడారు. ప్రజా రాజకీయాలలో ఆయన నడిచిన బాటలే తమకు ఆదర్శమని.. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.