దివంగత నేత పరిటాల రవికి తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. పరిటాల రవి 16వ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిటాల రవి జీవితాంతం పోరాటం చేశారని శ్రీనివాసరెడ్డి అన్నారు. వామపక్ష భావజాలం కలిగిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పరిటాల రవి పేదల మేలు కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం పోరాడారని తెలిపారు. ఈ క్రమంలో పేదల అభివృద్ధిని ఓర్వలేని పెత్తందార్లు రవన్నను కిరాతకంగా హత్య చేశారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, దాష్టీకాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించడమే రవన్నకు మనం అర్పించే ఘన నివాళి అని అన్నారు.
దివంగత నేత పరిటాల రవికి ఘనంగా నివాళులు - విజయవాడ ఎన్టీఆర్ భవన్
తెదేపా దివంగత నేత పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిటాల రవి జీవితాంతం పోరాటం చేశారని కొనియాడారు
దివంగత నేత పరిటాల రవికి ఘనంగా నివాళులు