ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్థిక సంక్షోభం అన్నది సాకు మాత్రమే: తెదేపా - కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులపై టీడీపీ కామెంట్స్

లాక్​డౌన్​తో కష్టాలు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఆర్థిక సంక్షోభం అంటూ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. కాంట్రాక్టర్లకు రూ.6400 కోట్లు చెల్లించిన ప్రభుత్వం... ఉద్యోగులకు జీతాలివ్వడానికి డబ్బుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

Tdp leaders
తెదేపా నేతలు
author img

By

Published : Apr 2, 2020, 8:14 PM IST

తెదేపా నేతల ట్వీట్లు

తన బినామీ కాంట్రాక్టర్లకు రెండు రోజుల్లో రూ.6400 కోట్లు చెల్లించిన ముఖ్యమంత్రి.. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయడు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలివ్వడానికి డబ్బుల్లేవని, రెండు విడతల్లో చెల్లిస్తానంటున్న సీఎం.. కాంట్రాక్టర్ల బిల్లులు ఎలా చెల్లించారని ట్విట్టర్ ద్వారా నిలదీశారు. ఉపాధి హామీ పనుల పాత‌బ‌కాయిలు వేల‌కోట్లు పెండింగ్‌లో ఉంచిన సీఎం.. ఉపాధి కూలీల‌కు చెల్లించాల్సిన 3 నెల‌ల వేత‌న బ‌కాయిలు రూ.455 కోట్లు చెల్లించ‌లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. వైకాపా కార్యక‌ర్తల ఉపాధి కోసం మాత్రం ఆగ‌మేఘాల మీద రూ.961 కోట్ల బిల్లులు చెల్లించటం ఏం న్యాయమని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details