ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫా - muslime news in krishna dt

రంజాన్ సందర్భంగా కృష్ణాజిల్లా విజయవాడ శివారులోని ప్రాంతాల్లో తెదేపా నాయకులు పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించారు. సుమారు 3200మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

tdp leaders provide ramjan thopha to poor muslims  in krishna dst
tdp leaders provide ramjan thopha to poor muslims in krishna dst

By

Published : May 25, 2020, 12:13 AM IST

విజయవాడ నగర శివారు గొల్లపూడి, జక్కంపూడి ప్రాంతాల్లోని పేద ముస్లింలకు తెదేపా ఆధ్వర్యంలో 3200 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. గొల్లపూడి మాజీ సర్పంచ్, తెదేపా సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక తేదేపా ముస్లిం మత పెద్దలు కలిసి జక్కంపూడి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఇంటింటికి తిరుగుతూ రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాయకత్వంలో కొన్ని సంవత్సరాలుగా... ఏటా పేద ముస్లిం సోదరులకు భారీ ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని... అధికారంలో ఉన్నా, లేకపోయినా తెదేపా తరపున ముస్లింలకు కావాల్సిన అనేక రకాల నిత్యావసర వస్తువులను ఇచ్చినట్లు బొమ్మసాని సుబ్బారావు తెలిపారు.

ఇదీ చూడండిశ్రీవారి ఆస్తులు బంధువర్గాలకు కట్టబెట్టేందుకు కుట్ర'

ABOUT THE AUTHOR

...view details