డాక్టర్ సుధాకర్ అరెస్టుకు నిరసనగా కృష్ణా జిల్లా తిరువూరు మండలం గానుగుపాడు, తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో కృష్ణా జిల్లా ఎస్సీ విభాగం, తెదేపా నియోజకవర్గ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. డాక్టర్ సుధాకర్‌పై దాడిని వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సామ్యూల్ జవహర్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు వాసం మునియ్య పాల్గొన్నారు.
డాక్టర్ సుధాకర్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల నిరసన - కృష్ణా జిల్లా తాజా వార్తలు
విశాఖలో డాక్టర్ సుధాకర్‌ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తిరువూరు మండలంలో ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆయనపై దాడిని పలువురు నాయకులు ఖండించారు.
![డాక్టర్ సుధాకర్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల నిరసన tdp-leaders-protest-over-doctor-sudhakar-arrest-issue-in-krishna-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7233408-61-7233408-1589717086446.jpg)
కృష్ణా జిల్లాలో ఎస్సీ సంఘాలు, తెదేపా నాయకుల నిరసన