రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం కొనతమాత్మకూరు, అంబారుపేట గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి రూ.5,000 ఇవ్వాలని, అన్న క్యాంటీన్లను తెరవాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని కోరారు.
'ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి' - నందిగామ నేటి వార్తలు
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ.5వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ... కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని పలు గ్రామాల తెదేపా నేతలు 12 గంటల నిరసస దీక్ష చేపట్టారు.
!['ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి' TDP leaders protest in nandigama krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7069212-63-7069212-1588675624295.jpg)
నందిగామలో తెదేపా నేతల 12 గంటల దీక్ష