కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని టిడ్కో గృహ సముదాయల వద్ద నాడు- నేడు పేరుతో తెదేపా ఆందోళన చేపట్టింది. ఎన్నికల ముందు ఉచితంగా ఇళ్ల పంపిణీ చేస్తామని పంచిన కరపత్రాలు, ఇప్పుడు రుణం చెల్లించమని చెప్పే అంగీకార పత్రాలను ఫెక్సీ పై ముద్రించి నిరసన తెలిపారు.
టిడ్కో ఇళ్ల వద్ద తెదేపా నేతల ఆందోళన - krishna district latest updates
టిడ్కో ఇళ్ల విషయంలో వైకాపా ప్రభుత్వం మాట తప్పి ప్రజలను వంచనకు గురి చేస్తుందని తెదేపా జాతీయ కోశాధికారి శ్రీరాం తాతయ్య విమర్శించారు.
టిడ్కో గృహసముదాలయల వద్ద తెదేపా నిరసన
ఈ సందర్భంగా తెదేపా జాతీయ కోశాధికారి శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ.... టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం మాట తప్పి ప్రజలను వంచనకు గురిచేసిందని విమర్శించారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకునే వరకూ ప్రజల పక్షాన తెదేపా పోరాడుతుందని అన్నారు.
ఇదీ చదవండి